
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం ఆరంభంలో పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 300పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 10600 కిందికిచేరింది. మిడ్ సెషన్ తరువాత రికవరీ సాధించిన సెన్సెక్స్ ప్రస్తుతం 219 పాయింట్లు క్షీణించి 35254 వద్ద నిఫ్టీ 47 పాయింట్లు నీరసించి 10,608 వద్ద ట్రేడవుతోంది. అయితే లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట ధోరణి నెలకొంది.అమెరికా మార్కెట్లలో ఐటి షేర్లలో నెలకొన్న అమ్మకాల ధోరణి దేశీయంగా ప్రభావితం చేస్తోంది. దీంతో ఇవాల్టి మార్కెట్‌లో ఐటీ టాప్ లూజర్‌గా ఉంది. అటు మెటల్ కూడా నష్టపోతుండగా, ఫార్మా , పీఎస్‌యూ బ్యాంక్స్ లాభపడుతున్నాయి.
టీసీఎస్, ఇన్ఫోసిస్, మైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, టాటా ఎలక్సీ, నిట్ టెక్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో 4-2 శాతం మధ్య నష్టపోయాయి. వీటితోపా ఆటు ఆర్‌ఐఎల్ కూడా బలహీనపడింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్, ఓరియంటల్, కెనరా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీవోబీ, ఇండియన్, విజయా, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, సిండికేట్, సెంట్రల్ బ్యాంక్, అలాగే ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ 7 శాతం జంప్‌చేయగా, అరబిందో, బయోకాన్, గ్లెన్‌మార్క్, సన్ ఫార్మా, సిప్లా, క్యాడిలా లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment