మార్కెట్లు వొలటైల్‌- అయినా భేష్‌ | Market gains despite high volatile session | Sakshi
Sakshi News home page

మార్కెట్లు వొలటైల్‌- అయినా భేష్‌

Published Tue, Sep 1 2020 4:04 PM | Last Updated on Tue, Sep 1 2020 4:04 PM

Market gains despite high volatile session - Sakshi

ముందురోజు నమోదైన భారీ పతనం నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. అయితే దేశీ జీడీపీ భారీ క్షీణత, చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో తీవ్ర ఆటుపోట్లను చవిచూశాయి. చివరికి సెన్సెక్స్‌ 273 పాయింట్లు జంప్‌చేసి 38,901 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 83 పాయింట్లు బలపడి 11,470 వద్ద నిలిచింది. ఒక దశలో 600 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌ 39,227 వద్ద గరిష్టాన్ని చేరింది. ఇదే విధంగా 38,542 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ఇంట్రాడేలో నిఫ్టీ 11,554- 11,367 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

ఐటీ వీక్
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ(0.25 శాతం) మినహా మిగిలిన రంగాలన్నీ లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 3.5-2 శాతం మధ్య ఎగశాయి. మీడియా, రియల్టీ, ఆటో సైతం 1.4-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, సిప్లా, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, కొటక్‌ బ్యాంక్‌ 7-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌ 5 శాతం పతనంకాగా.. ఓఎన్‌జీసీ, యాక్సిస్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, జీ, ఐవోసీ, టీసీఎస్‌, కోల్‌ ఇండియా 3-0.5 శాతం మధ్య డీలాపడ్దాయి.

బయోకాన్‌ జూమ్
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో బయోకాన్‌, పీవీఆర్‌, జిందాల్‌ స్టీల్‌, ఆర్‌ఈసీ, సెయిల్‌, నాల్కో, చోళమండలం, మణప్పురం, దివీస్‌, మదర్‌సన్, పీఎఫ్‌సీ, గ్లెన్‌మార్క్‌ 8-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోపక్క ఐడియా 14 శాతం కుప్పకూలగా..  ఎంజీఎల్‌, బీవోబీ, బాష్‌, ఆర్‌బీఎల్‌, సీఫోర్జ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ 5-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు1.2-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1203 లాభపడగా.. 1453 నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,395 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 681 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1004 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 544 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement