
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాలతో రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు చివరికి లాభాలతో స్థిరపడ్డాయి. సెన్సెక్స్, 60 పాయింట్ల లాభంతో 38417 వద్ద, నిఫ్టీ 21పాయింట్ల లాభంతో 11355 వద్దముగిసాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల షేర్లు,అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
భారతీ ఇన్‌ఫ్రాటెల్, హెచ్డీఎఫ్ సీ, డా. రెడ్డీస్, హెచ్ యూఎల్, టీసీఎస్, జీ, ఏసియన్ పెయింట్స్, ఐటీసీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఎంఅండ్ఎం, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, ఒఎన్‌జీసీ, సిప్లా, హీరో మోటో నిఫ్టీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు వోడాఫోన్ ఐడియా కొత్త బ్రాండింగ్ వార్తలతో భారీ లాభాలను దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment