ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు గురువారం ట్రేడింగ్ లోనూ సరికొత్త గరిష్ట స్థాయిలను తాకుతూ ఎంట్రీ ఇచ్చాయి.
మార్కెట్లు మరో సరికొత్త రికార్డులు
Published Thu, May 11 2017 9:43 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM
ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు గురువారం ట్రేడింగ్ లోనూ సరికొత్త గరిష్ట స్థాయిలను తాకుతూ ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 71.70 పాయింట్ల లాభంలో 30,319 వద్ద, నిఫ్టీ 27.60 పాయింట్ల లాభంలో 9,434 వద్ద లాభాలు పండిస్తున్నాయి.. ఐటీసీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, మహింద్రా అండ్ మహింద్రా, లార్సెన్ అండ్ టుబ్రో వంటి బ్లూచిప్ కంపెనీ మద్దతుతో మార్కెట్లు గరిష్ట స్థాయిలను తాకుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. ఇంట్రాడేలో 98 పాయింట్లకు సెన్సెక్స్ ఎగిసి, 30,346.79 వద్ద ట్రేడైంది.
వచ్చే రుతుపవనాల సీజన్ గురించి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించడంతో మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. ప్రాఫిట్ బుకింగ్ తో భారతీ ఎయిర్ టెల్, హెచ్యూఎల్ నష్టాలు గడిస్తున్నాయి. క్యూ 4 ఫలితాల్లో అంచనావేసిన దానికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో టెక్ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 1 శాతం పైకి ఎగిశాయి. అదేవిధంగా జీ ఎంటర్ టైన్మెంట్ మార్చి క్వార్టర్ ఫలితాలతో 3 శాతం మేర లాభపడుతోంది. టాప్ సెక్టోరియల్ గెయినర్ గా బీఎస్ఈ మెటల్స్ లాభాల్లో దూసుకుపోతూ 1.3 శాతం మేర పైకి ఎగిసింది.
Advertisement
Advertisement