
సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్ లాభాలతో దూసుకుపోతోంది. కీలక సూచీలు రెండూ రికార్డు స్థాయిలను దాటి ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఉజ్జీవన్ ఫైనాన్స్ ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 65 శాతం ఎగిసింది.ఆటో, బ్యాంకింక్ షేర్లలో కొనుగోళ్లతో సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లకుపైగా ఎగిసి రికార్డు హై వద్ద కనొసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్3 55 పాయింట్లు పుంజుకుని 41386 వద్ద ఉంది. నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 12148 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని ఐటీ రంగాలు లాభపడుతున్నాయి. వేదాంతా, మారుతి సుజుకి, యస్‌బ్యాంకు,ఐటీసీ టాప్ వినర్స్‌గా ఉండగా, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ నష్టపోతున్నాయి