బంగారం కొత్త రికార్డు రూ. 73,750
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల భయాలతో పసిడి, వెండి పరుగు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ధోరణులకు తగ్గట్లు దేశీయంగా వెండి, బంగారం ధరలు మంగళవారం మరో రికార్డు స్థాయిని తాకాయి. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ప్రకారం దేశ రాజధానిలో ఉదయం పసిడి 10 గ్రాముల ధర రూ. 700 పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి అయిన రూ. 73,750ని తాకింది.
అదే విధంగా వెండి ధర కూడా కేజీకి రూ. 800 పెరిగి రూ. 86,500 స్థాయిని తాకింది. ఎంసీఎక్స్‌లో జూన్ కాంట్రాక్టు ధర ఇంట్రా–డేలో రూ. 72,927 స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లు చూస్తే కామెక్స్‌లో ఔన్సు (31.1 గ్రాముల) పసిడి ధర 15 డాలర్లు పెరిగి 2,370 వద్ద ట్రేడయ్యింది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగినంత కాలం బంగారం బులిష్‌గానే ఉండనున్నట్లు ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment