సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నా.. గ్లోబల్ మార్కెట్ల దన్నుతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. దీంతో మంగళవారం నాటి జోష్‌ను కీలక సూచీలు కొనసాగించాయి. ఫలితంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. నిప్టీ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరగా, ఇంట్రాడేలో సెన్సెక్స్ 700 పాయింట్లు ఎగిసి 50 వేల దిశగా పరుగు దీసింది. అయితే చివరి అర‍్ధగంటలో లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 394 పాయింట్ల లాభంతో 49792 వద్ద, నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 14645 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్, నిఫ్టీ రెండూ రికార్డు క్లోజింగ్‌ను నమోదు చేశాయి. ఎఫ్‌ఎంసిజి తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ప్రధానంగా ఐటీ, ఆటో లాభాలు మార్కెట్లను లీడ్ చేశాయి.
టాటామోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీలు మోస్ట్ యాక్టివ్‌గా ఉన్నాయి. టాటామోటార్స్, అదాని పోర్ట్స్, విప్రో, మారుతీ సుజూకి, టెక్ మహీంద్రాలు 3-6.5 శాతం లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు శ్రీ సిమెంట్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, గెయిల్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment