సెన్సెక్స్‌కు 2 పాయింట్లు లాభం
నిఫ్టీకి 9 పాయింట్ల నష్టం
ముంబై: ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు మంగళవారం అక్కడిక్కడే ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ రెండు పాయింట్ల లాభంతో 81,510 వద్ద నిలిచింది. నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 24,610 వద్ద నిలిచింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ప్రథమార్థంతా లాభాల్లో కదిలాయి. మిడ్‌సెషన్‌లో లాభాల స్వీకరణతో నష్టాలు చవిచూశాయి.
ట్రేడింగ్ చివర్లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు రాణించడంతో నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 543 పాయింట్ల పరిధిలో 81,508 – 81,726 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 24,678 వద్ద కనిష్టాన్ని, 24,511 గరిష్టాన్ని తాకింది. రియలీ్ట, ఐటీ, మెటల్, కమోడిటీ, ఫైనాన్స్ సర్వీసెస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, పవర్, సర్విసెస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment