ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ లో బీజేపీ ఘనవిజయం మార్కెట్లకు భారీ కిక్కిచ్చింది. రికార్డు స్థాయిల్లో స్టాక్ మార్కెట్లు దూసుకొచ్చాయి. 560 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 424.95 పాయింట్ల లాభంలో 29,371 వద్ద కొనసాగుతోంది. 160 పాయింట్ల లాభాల్లో ప్రారంభమైన నిఫ్టీ సైతం 9,050 మార్కును దాటి ట్రేడవుతోంది.