ముంబై : విదేశీ నిల్వలు భారీ స్థాయిలో పెరిగాయి. రికార్డులను ఛేదిస్తున్న ఈ నిల్వలు ఆగస్టు 5తో ముగిసిన వారానికి గరిష్టంగా 365.749 బిలియన్ డాలర్లను తాకినట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది. విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్సీఏ) తగ్గినప్పటికీ, నిల్వలు పెరిగాయని ఆర్బీఐ పేర్కొంది. విదేశీ నిల్వల్లో విదేశీ కరెన్సీ ఆస్తులే ప్రధాన భాగంగా ఉంటాయి.
గత వారంలో విదేశీ నిల్వలు 2.81 బిలియన్ డాలర్లకు ఎగిసినట్టు వెల్లడించింది. ఎఫ్సీఏలు 340.278 బిలియన్ డాలర్ల నుంచి 765.4 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. నాన్-యూఎస్ కరెన్సీలు యూరో, ఫౌండ్, యెన్ తగ్గుదల, పెరుగుదలన్నింటినీ తీసుకుని ఎఫ్సీఏలను డాలర్లలో వ్యక్తపరుస్తారు. బంగారం నిల్వలు 1.008 బిలియన్ డాలర్లకు పెరిగి 21.584 బిలియన్ డాలర్లగా నమోదయ్యాయి. దేశీయ స్పెషల్ డ్రాయింగ్ హక్కులతో అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా పెరిగిందని ఆర్బీఐ తెలిపింది.
రికార్డు స్థాయిని తాకిన విదేశీ నిల్వలు
Published Sat, Aug 13 2016 1:59 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
Advertisement
Advertisement