
ముంబై: భారత విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్ నిల్వలు) భారీగా పెరిగా యి. మార్చి 7తో ముగిసి న వారానికి 15.267 బిలియన్ డాలర్లు పెరిగి 653.966 డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ తెలిపింది. గడిచిన రెండేళ్లలో ఈ స్థాయిలో అనూహ్యంగా పెరగడం ఇదే తొలిసారి.
వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు ఆర్‌బీఐ ఫిబ్రవరి 28న 10 బిలియన్ డాలర్లకు సమానమైన డాలర్–రూపాయి వేలాన్ని నిర్వహించడం ఫారెక్స్ నిల్వల అనూహ్య పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతకు మార్చి 1తో ముగిసిన వారం 1.781 బిలియన్ డాలర్లు తగ్గి 638.698 డాలర్లుగా ఉన్నాయి.
సమీక్షా వారం(మార్చి 7)లో విదేశీ కరెన్సీ ఆస్తులు 13.993 బిలియన్ డాలర్లు పెరిగి 557.282 బిలియన్ డాలర్లకు.., పసిడి నిల్వలు 1.053 బిలియన్ డాలర్ల నుంచి 74.325 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వద్ద నిల్వలు 69 మిలియన్ డాలర్లు తగ్గి 4.148 బిలియన్ డాలర్లకు దిగివచ్చినట్లు ఆర్‌బీఐ గణాంకాలు తెలియజేశాయి.
Comments
Please login to add a commentAdd a comment