ముంబై: విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వలు నవంబర్ 22తో ముగిసిన వారంలో 1.31 బిలియన్ డాలర్ల మేర క్షీణించి 656.58 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీనికి ముందు వారం (నవంబర్ 15తో అంతమైన)లో ఏకంగా 17.76 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారకం నిల్వలు తగ్గి 657.89 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.
ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 704.88 బిలియన్ డాలర్లకు చేరడం తెలిసిందే. ఇక ఆ తర్వాత నుంచి క్రమంగా ఇవి తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను పెద్ద మొత్తంలో ఉపసంహరించుకోవడం దీనివెనుక ప్రధాన కారణంగా ఉంది. నవంబర్ 22తో ముగిసిన వారంలో మొత్తం ఫారెక్స్ నిల్వల్లో విదేశీ కరెన్సీ నిల్వలు 3 బిలియన్ డాలర్ల మేర తగ్గి 566.79 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి.
ఫారెక్స్ నిల్వల్లో కరెన్సీ రూపంలోనే అధిక భాగం ఉంటుంది. బంగారం నిల్వలు సైతం 1.82 బిలియన్ డాలర్ల మేర తగ్గి 67.57 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఐఎంఎఫ్ వద్ద ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) విలువ 79 మిలియన్ డాలర్ల మేర తగ్గి 17.98 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఐఎంఎఫ్ వద్ద భారత నిల్వలు సైతం 15 మిలియన్ డాలర్లు తగ్గి 4.23 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్‌బీఐ గణాంకాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment