ముంబై: ఒక వారం విరామం తర్వాత భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు రికార్డు స్థాయిని చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాల ప్రకారం సెపె్టంబర్ 20వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చితే 2.838 బిలియన్ డాలర్లు పెరిగి 692.29 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫారెక్స్ నిల్వలు ఈ నెల 13వ తేదీతో ముగిసిన వారంలో కొంత వెనక్కుతగ్గినా, అంతక్రితం వరుసగా రెండు వారాలూ రికార్డు బాటన కొనసాగాయి.
అన్ని విభాగాల్లోనూ పురోగతి..
» డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ సమీక్షా వారంలో 2.057 బిలియన్ డాలర్లు పెరిగి 605.686 బిలియన్ డాలర్లకు ఎగసింది.
» పసిడి నిల్వలు 726 మిలియన్ డాలర్లు పెరిగి 63.613 బిలియన్ డాలర్లకు చేరాయి.
» ఐఎంఎఫ్ వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) విలువ 121 మిలియన్ డాలర్లు పెరిగి 18.54 బిలియన్ డాలర్లకు ఎగసింది.
» అయితే ఐఎంఎఫ్ వద్ద నిల్వల పరిమాణం 66 మిలియన్ డాలర్లు తగ్గి 4.458 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment