దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో మరోసారి రికార్డ్ స్థాయిల్లో ముగిశాయి.
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో మరోసారి రికార్డ్ స్థాయిల్లో ముగిశాయి. సెన్సెక్స 188 పాయింట్లు లాభపడి 29,586 వద్ద , నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 9153 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా సెన్సెక్స్ మరో కీలక మైలురాయిని అధిగమించడానికి 96 పాయింట్ల దూరంలోమాత్రమే ఉండగా, సాంకేతికంగా మరో బలమైన స్థాయి 9150కిపైన ముగియడం విశేషం. మిడ్‌క్యాప్ షేర్ల ఇవాళ కూడా కొనసాగింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఐటీ, అయిల్ అండ్ గ్యాస్ లాభపడ్డాయి. టాటా స్టీల్ టాప్ గెయినర్‌గా నిలిచింది. అదానీపోర్ట్స్, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో లాభపడగా, రిలయన్స్, హీరో మోటో, భారతి ఎయిరల్ టెల్, కోల్ ఇండియా నష్టపోయినవాటిల్లో ఉన్నాయి.
అటు డాలర్ మారకంలో రూపాయి దూసుకుపోతోంది. 0.21 పైసల లాభంతోమ రూ.65.46 వద్ద ఉంది. మరోవైపు ఫెడ్ వడ్డీరేట్లు పెంపు ప్రకటన, గ్లోబల్ సంకేతాలతో బంగారం భారీగా పుంజుకుంది. ఎంసీఎక్స్‌మార్కెట్‌లో పది గ్రా. 430 లాభపడి రూ. 28,415 వద్ద ఉంది.