సెన్సెక్స్ 100 పాయింట్ల లాభం!
సెన్సెక్స్ 100 పాయింట్ల లాభం!
Published Thu, Jun 12 2014 5:03 PM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM
ముంబై: రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ కంపెనీ షేర్లు లాభాల బాట పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీల సెన్సెక్స్ లాభాల్ని నమోదు చేసుకుంది.
నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 102 పాయింట్ల లాభంతో 25576 వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 7640 వద్ద క్లోజైంది.
హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేర్లు లాభపడటమే కాకుండా సెన్సెక్స్ 80 పాయింట్ల లాభాన్ని సంపాదించిపెట్టాయి. టీసీఎస్, సన్ ఫార్మా, ఐటీసీ, టాటా మోటార్స్, హిండాల్కో, మారుతి సుజుకీ, ఎన్ టీపీసీ కంపెనీలు ఓ మాదిరి లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా 3.76 నష్టపోగా, కోల్ ఇండియా 2.33, యాక్సీస్ బ్యాంక్ 1.96, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.80, భెల్ 1.44 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.
Advertisement