సెన్సెక్స్ కు 251 పాయింట్ల నష్టం! | Sensex, Nifty close in red; oil and gas stocks fall | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ కు 251 పాయింట్ల నష్టం!

Published Thu, Jun 26 2014 4:33 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM

సెన్సెక్స్ కు 251 పాయింట్ల నష్టం!

సెన్సెక్స్ కు 251 పాయింట్ల నష్టం!

ఇరాక్ లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి.

ముంబై: ఇరాక్ లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల చివరి రోజున సెన్సెక్స్ 251 పాయింట్ల నష్టంతో 25062 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు క్షీణించి 7493 వద్ద ముగిసాయి. 
 
సెన్సెక్స్ 25217 పాయింట్ల ఆరంభమై.. ఓదశలో ఇంట్రాడే ట్రేడింగ్ లో 25309 పాయింట్ల గరిష్టస్థాయిని, నిఫ్టీ 25021 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. 
 
 సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో టెక్ మహీంద్ర, లార్సెన్, విప్రో, డాక్టర్ రెడ్డీస్, హెచ్ సీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాలతో ముగిసాయి. ఓఎన్ జీసీ అత్యధికంగా 5.84 శాతం లాభపడగా, రిలయన్స్ 3.72, డీఎల్ఎఫ్ 3.15, ఎన్ టీపీసీ 2.90, గ్రాసీం 2.78 శాతం నష్టపోయాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement