నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్, నిఫ్టీ!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం ట్రేడింగ్ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 33 పాయింట్ల నష్టంతో 27975 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 8362 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఆర్ధిక గణాంకాల్లో సానుకూల ప్రభావం, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఆటో, విద్యుత్, కాపిటల్ గూడ్స్ కంపెనీల షేర్లు లాభపడటంతో.. ఆరంభంలో సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 28098 పాయింట్లను తాకింది.
సిప్లా, సన్ ఫార్మా, బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, లార్సెన్ లాభపడగా, బీపీసీఎల్, ఎన్ ఎమ్ డీసీ, కెయిర్న్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఐడీఎఫ్ సీ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.