సెన్సెక్స్ నష్టాలకు ఐటీ, హెల్త్ అడ్డుకట్ట!
సెన్సెక్స్ నష్టాలకు ఐటీ, హెల్త్ అడ్డుకట్ట!
Published Mon, Jun 16 2014 5:07 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM
ముంబై: ఐటీ, హెల్త్ కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్ కోలుకుని స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ తోపాటు, మరో ప్రధాన సూచీ నిఫ్టీ కూడా వరుసగా రెండో రోజు కూడా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.
క్రితం ముగింపుకు సెన్సెక్స్ 37 పాయింట్లు కోల్పోయి 25239 వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 7533 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25268 పాయింట్ల గరిష్ట స్థాయిని, 25063 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది.
సూచీ అధారిత కంపెనీ షేర్లలో గెయిల్ అత్యధికంగా 4.30 శాతం, బీపీసీఎల్ 3.72, డీఎల్ఎఫ్ 2.71, టీసీఎస్ 2.54, సన్ ఫార్మా 2.49 శాతం లాభాలను నమోదు చేసుకున్నాయి.
ఎంఅండ్ఎం 2.51 శాతం, యాక్సీస్ బ్యాంక్ 2.47, లార్సెన్ 2.10, హెచ్ డీఎఫ్ సీ 1.84, టాటా మోటార్స్ 1.69 శాతం నష్టపోయాయి.
Advertisement
Advertisement