నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్..
హైదరాబాద్: ఆయిల్, గ్యాస్ రంగాల కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో 25158 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు క్షీణించి 7526 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
డాక్టర్ రెడ్డీస్, లార్సెన్, భెల్, హెచ్ సీఎల్ టెక్, విప్రో, కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్ జీసీ అత్యధికంగా 5 శాతానికి పైగా నష్టపోగా, రిలయన్స్, డీఎల్ఎఫ్, ఎన్ టీపీసీ, బీపీసీఎల్ కంపెనీలు 2 శాతానికి పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.