నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 30 పాయింట్ల నష్టంతో 27837, నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయి 8327 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఇంట్రాడే ట్రేడింగ్ లో ..
నిఫ్టీ ఆరంభం 8337, గరిష్టం 8383, కనిష్టం 8304 పాయింట్లను, సెన్సెక్స్ 27919 ప్రారంభమై 28027 గరిష్టం, కనిష్టం 27764 పాయింట్లను తాకింది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో
ఐటీసీ, సన్ ఫార్మా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోల్ ఇండియా, బీహెచ్ఈఎల్ కంపెనీలు స్వల్ప లాభాల్లో, ఓఎన్ జీసీ, జిందాల్ స్టీల్, లార్సెన్, టాటా మోటార్స్, హిండాల్కో కంపెనీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి.