నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీలు బుధవారం నాటి ట్రేడింగ్ లో నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్ 31 పాయింట్ల పతనంతో 26744 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 8002 వద్ద ముగిసాయి.
హెచ్ యూఎల్, కోల్ ఇండియా, విప్రో, ఐటీసీ, ఇన్పోసిస్ కంపెనీలు లాభాలతో కొనసాగుతున్నాయి. పీఎన్ బీ, బీహెచ్ ఈఎల్, బీపీసీఎల్, టాటా పవర్, బ్యాంక్ ఆఫ్ బరోడా కంపెనీలు రెండు శాతానికి పైగా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.