తొలిసారి 7900 మార్కుపైన నిఫ్టీ
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు శుక్రవారం ట్రేడింగ్ లో స్వల్ప లాభాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 26419 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల వృద్ధితో 7913 వద్ద ముగిసాయి. నిఫ్టీ తొలిసారి 7900 పాయింట్ల మార్క్ పై ముగియడం విశేషం. బ్యాంకింగ్, ఐటీ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26508-26383 పాయింట్ల, నిఫ్టీ 7929-7900 పాయింట్ల మధ్య కదలాడింది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో టెక్ మహీంద్ర అత్యధికంగా 3.14 శాతం, హిండాల్కో 2.59, హెచ్ సీఎల్ టెక్ 2.52, ఎస్ బీఐ 2.32, బ్యాంక్ బరోడా 2.05 శాతం లాభాపడ్డాయి. కోల్ ఇండియా, బీపీసీఎల్, హెచ్ డీఎఫ్ సీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.