జీవితకాలపు గరిష్ట స్థాయికి సెన్సెక్స్!
ఐటీ, మీడియా, టెక్నాలజీ, ఆటో రంగాల కంపెనీల షేర్లు రాణించడంతో భారత ప్రధాన సూచీలు మరో జీవితకాలపు గరిష్టాన్ని నమోదు చేసుకున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 27198 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి.
మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంతో 27139 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల పెరిగి 8115 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
భారతీ ఎయిర్ టెల్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎన్ఎమ్ డీసీ లాభాల్లో, గెయిల్, జిందాల్ స్టీల్, బజాజ్ ఆటో, ఐటీసీ, ఐడీఎఫ్ సీ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.