లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
ముంబై: పరపతి సమీక్షలో భాగంగా కీలక వడ్డీ రేట్లలో మార్పులు లేకుండా రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయానికి భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సానుకూలంగా స్పందించాయి.
ప్రారంభంలో స్వల్ప నష్టాలతో ప్రారంభమైన ప్రధాన సూచీలు మధ్యాహ్న సమయానికి లాభాల్ని నమోదు చేసుకున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి సెన్సెక్స్ 210 పాయింట్ల వృద్ధితో 268080 పాయింట్ల వద్ద, నిఫ్టీ 63 పాయింట్ల పెరుగుదలతో 8022 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
జీఎంటర్ టైన్ మెంట్, హెచ్ డీఎఫ్ సీ, కోటాక్ మహీంద్ర, సన్ ఫార్మా, లార్సెన్ కంపెనీలు 2 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. యాక్సీస్ బ్యాంక్, గ్రాసీం, టెక్ మహీంద్ర కంపెనీలు స్వల్ప నష్టాల్లో వ్యాపార కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నాయి.