రికార్డుస్థాయి నుంచి జారిన సెన్సెక్స్!
హైదరాబాద్: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు రికార్డు గరిష్ట స్థాయి నుంచి కిందికి జారాయి. ఆరంభంలో సాధించిన లాభాలు మార్కెట్ ముగింపు కల్లా ఆవిరిపోయాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల స్వల్ప లాభంతో 26437 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 7906 వద్ద ముగిసాయి.
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26,630-26,401, నిఫ్టీ 7968-7897 పాయింట్ల మధ్య కదలాడింది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో టీసీఎస్, భెల్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, మారుతి సుజికీ, హెచ్ యూఎల్ కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
జిందాల్ స్టీల్, హిండాల్కో, టాటా స్టీల్, సెసా స్టెర్ లైట్, టాటా పవర్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిసాయి.