నష్టాల నుంచి లాభాల్లోకి...
ముంబై: ఇంట్రాడే ట్రేడింగ్ లో ఊగిసలాటకు లోనైన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ముగిసాయి. సోమవారం ట్రేడింగ్ లో నష్టాలతో ప్రారంభమైన ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు లాభాల్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 116 పాయింట్ల లాభంతో 27206 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల వృద్దితో 8146 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.
టాటా మోటార్స్, ఓఎన్ జీసీ, ఐటీసీ, బీపీసీఎల్, ఇండస్ ఇండియా బ్యాంక్ లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, ఐడీఎఫ్ సీ, భెల్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి.