సెన్సెక్స్ రికార్డు ముగింపు!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం రికార్డుస్థాయి లాభాలతో ముగిసాయి. గురువారం నాటి మార్కెట్ లో ప్రధాన సూచీలు నిఫ్టీ 8180 పాయింట్ల, సెన్సెక్స్ 27358 పాయింట్ల ఇంట్రాడే లైఫ్ టైమ్ హైని తాకాయి. మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 248 పాయింట్ల లాభంతో 27346 పాయింట్ల వద్ద, నిఫ్టీ 78 పాయింట్ల వృద్ధితో 8169 వద్ద క్లోజయ్యాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ అత్యధికంగా 5 శాతం, హెచ్ సీఎల్ టెక్ 4, టెక్ మహీంద్ర 3, రిలయన్స్, ఇండస్ ఇండియా బ్యాంక్ లు 2 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. కెయిర్న్ ఇండియా, అంబుజా సిమెంట్స్, సిప్లా, సెసా స్టెరిలైట్, ఎం అండ్ ఎం కంపెనీల షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.