భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, మెటల్, హెల్త్ కేర్, కాపిటల్ గూడ్స్ రంగాల కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 1.11 శాతంతో 296 పాయింట్లు నష్టపోయి 26271 పాయింట్ల వద్ద, నిఫ్టీ 93 పాయింట్ల పతనంతో 7852 పాయింట్ల వద్ద ముగిసాయి.
ప్రధాన సూచీలలో ఎన్ టీపీసీ, గెయిల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, విప్రో, టాటా మోటార్స్ స్వల్ప లాభాల్ని నమోదు చేసుకోగా, డీఎల్ఎఫ్, సెసాగోవా స్టెరిలైట్, జిందాల్ స్టీల్, హిండాల్కో, కెయిర్న్ ఇండియా కంపెనీలు 4 శాతం నుంచి 6 శాతం మేరకు నష్టాలతో ముగిసాయి.