102 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్!
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం లాభాలతో ముగిసాయి.
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం లాభాలతో ముగిసాయి. ఆటో, మెటల్, కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాలు మద్దతు పలకడంతో ప్రధాన సూచీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
సెన్సెక్స్ 102 పాయింట్ల లాభంతో 25516 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల వృద్దితో 7634 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,571 పాయింట్ల గరిష్టస్థాయిని 25,466 కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో హిండాల్కో అత్యధికంగా 6.73 శాతం, మారుతి సుజుకీ 5.93, టాటా మోటార్స్ 4.52, ఎం అండ్ ఎం 4.11, టాటా స్టీల్ 2.32 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఏషియన్ పేయింట్స్, విప్రో, టీసీఎస్, సన్ ఫార్మా, ఇన్పోసిస్ కంపెనీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.