స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో ముగిసాయి
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 25924 పాయింట్ల గరిష్టస్థాయిని నమోదు చేసుకున్న తర్వాత ఉదయం 9.35 గంటలకు సాంకేతిక కారణాలతో బాంబే స్టాక్ ఎక్స్చెంజ్ ట్రేడింగ్ వ్యవహారాలు నిలిచిపోయాయి.
అయితే మధ్యాహ్నం తర్వాత బీఎస్ ఈ ట్రేడింగ్ ఆరంభమైంది. ట్రేడింగ్ చివర్లో సెన్సెక్స్ 17 పాయింట్ల క్షీణించి 25823, నిఫ్టీ 10 కోల్పోయి 7714 వద్ద ముగిసాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో టాటా మోటార్స్, విప్రో, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, సిప్లా స్వల్ప లాభాలతో ముగిసాయి. హీరో మోటో కార్ప్, హిండాల్కో, టాటా పవర్, బజాజ్ ఆటో, ఓఎన్ జీసీ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.