కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవు: ఆర్ బీఐ
ముంబై: రెండు నెలలకోసారి నిర్వహించే పరపతి ద్రవ్య సమీక్షలో భాగంగా కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయకుండా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. స్వల్ప కాలిక అవసరాల కోసం తీసుకున్న రుణాలపై బ్యాంకుల రిజర్వు బ్యాంకుకు చెల్లించే రెపో రేటు 8 శాతం, వాణిజ్య బ్యాంకులు డిపాటిజ్ చేసే స్వల్పకాలిక పొదుపుకు చెల్లించే రివర్స్ రెపోరేటు 7 శాతం, క్యాష్ రిజర్వు రేషియో (సీఆర్ఆర్) 4 శాతం రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ఆర్ బీఐ నిర్ణయం తీసుకుంది.
స్టాట్యూటరి లిక్విడిటి రేషియో(ఎస్ఎల్ఆర్) ను 22 శాతం, ఎన్ డీటీఎల్ లలో కూడా ఎలాంటి మార్పులు లేకుండానే కొనసాగించాలని సెంట్రల్ బ్యాంక్ అధికారులు నిర్ణయించారు. రిజర్వు బ్యాంకు నిర్ణయంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సానుకూలంగా స్పందించాయి.