నష్టాల నుంచి లాభాల్లోకి సెన్సెక్స్
నష్టాల నుంచి లాభాల్లోకి సెన్సెక్స్
Published Tue, Aug 5 2014 4:04 PM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
హైదరాబాద్: రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం ట్రేడింగ్ లో లాభాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 184 పాయింట్ల లాభంతో 25908 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల వృద్ధితో 7746 వద్ద ముగిసాయి.
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,928 గరిష్ట స్థాయిని, 25,562 పాయింట్ల కనిష్ట స్థాయిని, నిఫ్టీ 7752 పాయింట్ల గరిష్ట స్థాయిని, 7638 పాయింట్ల కనిష్టస్థాయిని నమోదు చేసుకున్నాయి.
అల్ట్రా టెక్ సిమెంట్స్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, గ్రాసీం, ఎం అండ్ ఎం కంపెనీలు లాభాలతో, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, హెచ్ సీఎల్ టెక్, ఎన్ ఎమ్ డీసీ, భారతీ ఎయిర్ టెల్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి.
Advertisement