ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాల్లో సెన్సెక్స్
ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాల్లో సెన్సెక్స్
Published Tue, Apr 1 2014 4:15 PM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM
రిజర్వు బ్యాంక్ త్రైమాసిక రుణ సమీక్ష నేపథ్యంలో ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 60 పాయింట్ల వృద్ధితో 22446 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 6721 వద్ద ముగిసాయి. ఓ దశలో సెన్సెక్స్ 22485 పాయింట్ల గరిష్టస్థాయిని 22295 పాయింట్ల కనిష్ట స్థాయిని, నిఫ్టీ 6732 గరిష్ట స్థాయిని, 6675 కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి.
సూచీ ఆధారి కంపెనీ షేర్లలో అత్యధికంగా కెయిర్న్ ఇండియా 3.59, విప్రో 3.29, పవర్ గ్రిడ్ 2.86, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.23, టీసీఎస్ 2.04 శాతం లాభాల్ని సాధించాయి.
బీపీసీఎల్, హిండాల్కో, కొటాక్ మహీంద్ర, మారుతి సుజుకీ, ఏషియన్ పేయింట్స్ 2 శాతానికి పైగా నష్టాలతో ముగిసాయి.
త్రైమాసిక పరపతి సమీక్షలో వడ్డీ రేట్లలో ఏలాంటి మార్పులు చేయకుండా రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement