మోడీ 'కిక్కు'తో 25 వేల మార్కు పైన సెన్సెక్స్!
నరేంద్రమోడీ విజయం అందించిన ఉత్సాహంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెడుతున్నాయి. సోమవారం ఉదయాన్నే ప్రధాన సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
ప్రధాన సూచీలలలో సెన్సెక్స్ 425 పాయింట్ల లాభంతో 25115 పాయింట్ల వద్ద, నిప్టీ 120 పాయింట్ల వృద్దితో 7485 వద్ద కొనసాగుతున్నాయి. విదేశీ మదుపుదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపడంతో సెన్సెక్స్ మరోసారి 25 వేల మార్కును అధిగమించింది.
సూచీ అధారిత కంపెనీ షేర్లలో ఎం అండ్ ఎం, లార్సెన్, కోల్ ఇండియా, ఓఎన్ జీసీ, కెయిర్న్ ఇండియా కంపెనీల షేర్లు 4 శాతానికి పైగా లాభాలతో కొనసాగుతున్నాయి.
ఏషియన్ పెయింట్స్, హిండాల్కో, సిప్లా, హీరో మోటో కార్ప్, లుపిన్ కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.