లైఫ్ టైమ్ హై వద్ద సెన్సెక్స్, నిఫ్టీ
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా ఆరవ రోజు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగంలో వివిధ రంగాల అభివృద్దికి ప్రభుత్వం సానుకూలంగా ఉందనే వ్యాఖ్యలతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెడుతున్నాయి.
మంగళవారం ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 129 పాయింట్ల లాభంతో 26520 పాయింట్ల జీవితకాలపు గరిష్టస్థాయిని నమోదు చేసుకుంది. అలాగే నిఫ్టీ 7900 పాయింట్ల లైఫ్ టైమ్ హై మార్క్ ని తాకింది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో సెసా గోవా స్టెరిలైట్, యునైటెడ్ స్పిరిట్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, ఇండస్ ఇండియా బ్యాంక్, బీపీసీఎల్ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
టీసీఎస్, హెచ్ డీఎఫ్ సీ, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, సిప్లా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.