నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: ఆయిల్, గ్యాస్ కంపెనీ షేర్లు పతనం, గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటం తదితర అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 182 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఐడీఎఫ్ సీ, డీఎల్ఎఫ్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, టాటా పవర్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కెయిర్న్ ఇండియా, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఎం అండ్ఎం కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.