సెన్సెక్స్ లైఫ్ టైమ్ హై!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీ సెన్సెక్స్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అక్టోబర్ డెరెవేటివ్ కాంట్రాక్టు ముగింపు రోజున సెన్సెక్స్ జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. 260 పాయింట్ల లాభపడిన సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్ 27358 పాయింట్లను తాకింది.
భారత ఆర్ధిక రంగంలో మోడీ సర్కార్ మరిన్ని సంస్కరణలు చేపట్టవచ్చనే వార్తలు, ఎఫ్ డీఐ నిబంధనల్ని సరళీకృతం చేస్తారనే అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నేటి మార్కెట్ లో ఇన్పోసిస్,టీసీఎస్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ అండ్ టీ కంపెనీలు షేర్లు సెన్సెక్స్ బలపడటానికి ఊతమిచ్చాయి.