సెన్సెక్స్ కు 208 పాయింట్ల నష్టం!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్, 208 పాయింట్లు, నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయాయి. ఈ మొత్తంలో ప్రధాన సూచీలు నష్టపోవడం గత నెల రోజుల వ్యవధిలో ఇదే తొలిసారి. సెన్సెక్స్ 27057 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8094 వద్ద ముగిసాయి.
ఐడీఎఫ్ సీ, డీఎల్ఎఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, సెసా గోవా కంపెనీ షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. కెయిర్న్ ఇండియా, హీరో మోటోకార్ప్, బీపీసీఎల్, ఐటీసీ, కోల్ ఇండియా నష్టాలతో ముగిసాయి.