మూడో రోజు కూడా నష్టాల్లోనే...
హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 25 పాయింట్ల నష్టంతో 26246 పాయింట్ల వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు క్షీణించి 7842 వద్ద ముగిసాయి.
సూచీ ఆధారి కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ అత్యధికంగా 5.12 శాతం లాభపడగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఓఎన్ జీసీ కంపెనీలు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, విప్రో కంపెనీలు 4 నుంచి 5 శాతం మేరకు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.