నష్టాలతో ముగిసిన సెన్సెక్స్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఎఫ్ఎమ్ సీజీ, బ్యాంకింగ్ రంగాల కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొనగా, కాపిటల్ గూడ్స్, ఐటీ, హెల్త్ కేర్, మెటల్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు జరిగాయి.
సెన్సెక్స్ 54 పాయింట్ల పతనంతో 27031 పాయింట్ల వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 8086 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.
ఎన్ఎమ్ డీసీ, డీఎల్ఎఫ్, జిందాల్ స్టీల్, ఏషియన్ పెయింట్స్, కొటాక్ మహీంద్ర కంపెనీల షేర్లు లాభాలతో ముగిసాయి. యునైటెడ్ స్పిరిట్, హెచ్ డీఎఫ్ సీ, కోల్ ఇండియా, హీరో మోటో కార్ప్, భెల్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.