భారీ నష్టాల్లో సెన్సెక్స్
హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం భారీ నష్టాలతో ముగిసాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో మొబైల్స్, కాపిటల్ గూడ్స్, మెటల్, బ్యాంకింగ్ రంగాల కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్ 350 పాయింట్ల నష్టంతో 25999 పాయింట్ల వద్ద, నిఫ్టీ 116 పాయింట్ల పతనంతో 7748 వద్ద ముగిసాయి.
సూచీ ఆధారిత కంపెనీల్లో అల్ట్రా టెక్ సిమెంట్స్ అత్యధికంగా 6.06 శాతం, హిండాల్కో 5.70, గ్రాసీం 4.86, ఎం అండ్ ఎం 4.31, సెసా గోవా 4.17 శాతం నష్టపోయాయి. డీఎల్ఎఫ్ 5 శాతం లాభపడగా, ఎన్ ఎమ్ డీసీ, ఐటీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు స్వల్ప లాభాల్ని నమోదు చేసుకున్నాయి.