స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం స్వల్ప లాభాలతో ముగిసాయి. బుధవారం ముగింపుకు సెన్సెక్స్ 45 పాయింట్ల లాభంతో 26360 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల వృద్దితో 7891 వద్ద ముగిసాయి.
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26464-26262 పాయింట్ల మధ్య, నిఫ్టీ 7919-7855 పాయింట్ల మధ్య కదలాడాయి.
పీఎన్ బీ, బజాజ్ ఆటో, బీపీసీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బీఐ కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్, యునైటెడ్ స్పిరిట్, ఎన్ టీపీసీ, సెసాగోవా, టాటాస్టీల్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి.