స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్!
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో్ సెన్సెక్స్ 62 పాయింట్లు క్షీణించి 26567 పాయింట్ల వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 7945 పాయింట్ల వద్ద ముగిసాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో విప్రో అత్యధికంగా 3.18 శాతం, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీలు సుమారు 2 శాతం లాభపడ్డాయి.
ఇండస్ ఇండియా బ్యాంక్, మారుతి సుజుకీ, టాటా పవర్, కెయిర్న్ ఇండియా, గెయిల్ కంపెనీలు సుమారు మూడు శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.