క్రితం ముగింపు వద్దే సెన్సెక్స్..
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు క్రితం ముగింపుకు చేరువగా క్లోజయ్యాయి.
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు క్రితం ముగింపుకు చేరువగా క్లోజయ్యాయి. మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో జీవితకాలపు గరిష్ట స్థాయిని తాకిన సూచీలు లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్ని చవిచూశాయి.
అయితే చివరికి సెన్సెక్స్ 3 పాయింట్లు లాభపడి 25583 వద్ద, నిఫ్టీ 1 నష్టంతో 7656 వద్ద ముగిసాయి. ఓ దశలో సెన్సెక్స్ 25347 పాయింట్ల కనిష్ట స్థాయి నుంచి తేరుకుంది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 775 పాయింట్లు లాభపడింది.
సెన్సెక్స్ సూచీలోని యాక్సీస్ బ్యాంక్, ఎస్ బీఐ, హీరో మోటో కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, భెల్, బజాజ్ ఆటో, ఓఎన్ జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సెసా స్టెరిలైట్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.
టీసీఎస్, విప్రో, సిప్లా, సన్ ఫార్మా, హిండాల్కో, హెచ్ యూఎల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, హెచ్ డీఎఫ్ సీలు లాభాలను నమోదు చేసుకున్నాయి.