లాభాల్లో స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు
ముంబై: వడ్డీ రేట్లలో కోత విధింపు, కార్పోరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాల్లో సానుకూలత, ఇతర సానుకూల అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 128 పాయింట్ల లాభంతో 26880 పాయింట్ల వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల వృద్దితో 8037 పాయింట్ల వద్ద ముగిసింది.
సన్ ఫార్మా, సిప్లా, టాటా పవర్, బీపీసీఎల్, ఎస్ బీఐ కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకోగా, లుపిన్ భారతీ ఎయిర్ టెల్, హీరో మోటో కార్ప్, జిందాల్ స్టీల్, పీఎన్ బీ కంపెనీలు స్వల్ప నష్టాలకు లోనయ్యాయి.