భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు!
బ్యాంకింగ్, మెటల్, ఆయిల్, గ్యాస్, ఆటో, కాపిటల్ గూడ్స్ రంగాల కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 276 పాయింట్ల నష్టంతో 26468 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో 7911 వద్ద ముగిసాయి. తాజా పతనంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక నెల కనిష్టాన్ని నమోదు చేసుకున్నాయి. ఐటీ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా 7.70 శాతం జిందాల్ స్టీల్ నష్టపోగా, పీఎన్ బీ 6.15, ఎన్ ఎమ్ డీసీ 5.45, యాక్సీస్ బ్యాంక్ 4.82, హిండాల్కో 4.45 శాతం పతనమయ్యాయి. డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, గెయిల్, జీ ఎంటర్ టైన్ మెంట్, సిప్లాలు సుమారు 2 శాతం లాభపడ్డాయి.