నాలుగవ రోజు కూడా నష్టాల్లోనే సెన్సెక్స్ !
ఇరాక్ లో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో చమురు ధరలు పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి.
ఓ దశలో ఇంట్రాడే ట్రేడింగ్ సెన్సెక్స్ 25 వేల, నిఫ్టీ 7500 మార్కు దిగువకు పడిపోయింది. సోమవారం నాటి మార్కెట్ లో సెన్సెక్స్ 25,197 గరిష్ట స్థాయిని, 24,878 కనిష్టస్థాయిని, నిఫ్టీ 7,534 గరిష్ట స్థాయిని, 7,441 కనిష్టస్థాయిని తాకాయి.
ఇంట్రాడే ట్రేడింగ్ లో 200 పైగా పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ మార్కెట్ చివరలో లో 74 పాయింట్ల నష్టంతో 25031 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 7493 వద్ద ముగిసాయి.
అత్యధికంగా ఓఎన్ జీసీ 4.81 శాతం వృద్దిని సాధించగా, జిందాల్ స్టీల్ 2.73, హీరో మోటార్ కార్ప్ 2.48, భెల్ 2.32, ఏసీసీ 2.25 శాతం లాభంతో సెన్సెక్స్ కు మద్దతిచ్చాయి.
ఐటీసీ అత్యధికంగా 6.18 శాతం నష్టపోగా, కొటాక్ మహీంద్ర 3.84, యునైటెడ్ స్పిరిట్ 3.18, ఇన్పోసిస్ 2.53, హెచ్ సీఎల్ టెక్ 1.72 నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.