Iraq violence
-
నాలుగవ రోజు కూడా నష్టాల్లోనే సెన్సెక్స్ !
ఇరాక్ లో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో చమురు ధరలు పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. ఓ దశలో ఇంట్రాడే ట్రేడింగ్ సెన్సెక్స్ 25 వేల, నిఫ్టీ 7500 మార్కు దిగువకు పడిపోయింది. సోమవారం నాటి మార్కెట్ లో సెన్సెక్స్ 25,197 గరిష్ట స్థాయిని, 24,878 కనిష్టస్థాయిని, నిఫ్టీ 7,534 గరిష్ట స్థాయిని, 7,441 కనిష్టస్థాయిని తాకాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో 200 పైగా పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ మార్కెట్ చివరలో లో 74 పాయింట్ల నష్టంతో 25031 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 7493 వద్ద ముగిసాయి. అత్యధికంగా ఓఎన్ జీసీ 4.81 శాతం వృద్దిని సాధించగా, జిందాల్ స్టీల్ 2.73, హీరో మోటార్ కార్ప్ 2.48, భెల్ 2.32, ఏసీసీ 2.25 శాతం లాభంతో సెన్సెక్స్ కు మద్దతిచ్చాయి. ఐటీసీ అత్యధికంగా 6.18 శాతం నష్టపోగా, కొటాక్ మహీంద్ర 3.84, యునైటెడ్ స్పిరిట్ 3.18, ఇన్పోసిస్ 2.53, హెచ్ సీఎల్ టెక్ 1.72 నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
బాగ్దాద్‌లో బాంబు పేలుళ్లు: 27 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో నిన్న చోటు చేసుకున్న వేర్వేరు బాంబు దాడులు, కాల్పుల ఘటనల్లో మొత్తం 27 మంది మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. మరో 70 మంది గాయపడ్డారని, క్షతగాత్రులు బాగ్దాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాగ్దాద్‌లో నిన్న రాత్రి జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మరణించారు. వారిలో సింహభాగం సైనికులే అని చెప్పారు. అందులో 45 మంది గాయపడ్డారన్నారు. అలాగే సున్నీ అరబ్ పట్టణంలో తర్మియ ప్రాంతంలో ఇరాక్ ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి చేసిందని వివరించారు. ఆ ఘటన రాత్రి 10.30 గంటలకు చోటు చేసుకుందని తెలిపారు. అలాగే గురువారం ఉదయం బాంబు పేలుళ్లు, వేర్వేరు కాల్పుల ఘటనలో 12 మంది మరణించగా, 23 మంది గాయపడ్డారు. అయితే ఇరాక్‌లో బాంబుపేలుళ్లు, ఆత్మాహుతి దాడులు నిత్యకృత్యం కావడం పట్ల యూఎస్ అసిస్టెంట్స్ మిషన్ ఫర్ ఇరాక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి గత నెల అక్టోబర్ వరకు 7వేల మంది మృత్యువాత పడ్డారని, అలాగే 16 వేల మంది గాయడ్డారని గణాంకాలతో సహా సోదాహరణగా యూఎస్ అసిస్టెంట్స్ మిషన్ ఫర్ ఇరాక్ వివరించింది. -
ఇరాక్‌లో బాంబు పేలుళ్లు: 11 మంది మృతి
ఇరాక్‌లో నిన్న వేర్వేరుగా జరిగిన బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు, ఆగంతకుల తుపాకి కాల్పుల ఘటనల్లో 11 మంది మరణించారని పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. మరో 35 మంది గాయపడ్డారని తెలిపారు. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. కాగా క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. మృతులు, గాయపడిన వారిలో భద్రత సిబ్బంది, దేశ పౌరులు ఉన్నారని చెప్పారు. ఇరాక్‌లో నిత్యం ఎక్కడోఅక్కడ రక్తమోడడం పట్ల యూఎన్ మిషన్ అసిస్టెంట్ మిషన్ ఆఫ్ ఇరాక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు ఇరాక్‌లో జరిగిన ఆత్మాహుతి దాడులు, పలు బాంబు పేలుళ్లలో 7 వేల మంది దుర్మణం పాలైయ్యారని, అలాగే 16 వేల మంది గాయాలపాలైయ్యారని యూఎన్ మిషన్ అసిస్టెంట్ మిషన్ ఆఫ్ ఇరాక్ తాజా గణాంకాలతో సహా వివరించింది. -
ఇరాక్ హింసాత్మక ఘటనల్లో 44 మంది మృతి
ఇరాక్‌లో జరిగిన వివిధ హింసాత్మక ఘటనల్లో 44 మంది మృతి చెందారు. 133 మంది మృతి చెందారని పోలీసులు, అధికారులు తెలిపారు. బాగ్దాద్‌లోని షాలా ప్రాంతంలో ఉన్న ఓ పాపులర్ కేప్ సమీపంలో రోడ్డు పక్కన బాంబు పేలడంతో 3 ముగ్గురు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. దక్షిణ బాగ్దాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో స్థానిక నాయకుడు, అతడి భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆల్-డెబిస్ ప్రాంతంలో కారు బాంబు పేలడంతో ఇద్దరు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. ఆబు సేదా పట్టణంలో ఇద్దరు రైతులను కాల్చి చంపారు. 12 కారు బాంబు పేలుళ్లతో సహా వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల ఘటనల్లో కనీసం 31 మంది మృత్యువాత పడ్డారు. 95 మంది గాయపడ్డారు.