ఇరాక్లో నిన్న వేర్వేరుగా జరిగిన బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు, ఆగంతకుల తుపాకి కాల్పుల ఘటనల్లో 11 మంది మరణించారని పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. మరో 35 మంది గాయపడ్డారని తెలిపారు. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. కాగా క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు.
మృతులు, గాయపడిన వారిలో భద్రత సిబ్బంది, దేశ పౌరులు ఉన్నారని చెప్పారు. ఇరాక్లో నిత్యం ఎక్కడోఅక్కడ రక్తమోడడం పట్ల యూఎన్ మిషన్ అసిస్టెంట్ మిషన్ ఆఫ్ ఇరాక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు ఇరాక్లో జరిగిన ఆత్మాహుతి దాడులు, పలు బాంబు పేలుళ్లలో 7 వేల మంది దుర్మణం పాలైయ్యారని, అలాగే 16 వేల మంది గాయాలపాలైయ్యారని యూఎన్ మిషన్ అసిస్టెంట్ మిషన్ ఆఫ్ ఇరాక్ తాజా గణాంకాలతో సహా వివరించింది.