బాగ్దాద్: ఇరాక్ లో ఓ ఉగ్రవాది ఘోర మారణకాండకు దిగాడు. రాజధాని బాగ్దాద్ లో ఓ షియా మసీదు ప్రాంగణంలో ఆత్మాహుతిదాడికి పాల్పడటంతో ఎనిమిది మంది పౌరులు ప్రాణాలుకోల్పోగా .. 19మందికి తీవ్ర గాయాలయ్యాయి. మసీదు ప్రాంగణం రక్తపు చారీకలతో నిండిపోయింది. అయితే, ఈ దాడిని ఎవరు చేశారనే విషయం ఇంకా తెలియరాలేదు. ఇరాక్ అధికారులు మాత్రం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఇలాంటి ఆత్మాహుతి దాడులకు పాల్పడతారని చెప్తున్నారు.
సాధారణంగా షియా వర్గం ముస్లింలనే ఎప్పుడూ ఇస్లామిక్ స్టేట్ లక్ష్యంగా చేసుకొని వారి సమూహం ఎక్కడ ఉంటే అక్కడ ఆత్మాహుతి దాడులకు పాల్పడుతుంటుంది. గత ఏడాది బాగ్దాద్ లోని పెద్దమొత్తం ప్రాంతాన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆక్రమించుకోగా ఇరాక్ సేనలు చాలాకాలం ప్రతిఘటించి తిరిగి వారిని తిప్పి కొట్టారు. అప్పటి నుంచి జనరద్దీ ప్రాంతాలను, షియాలు ప్రార్ధనలు చేసే మసీదులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారు.
మసీదుపై ఆత్మాహుతి దాడి
Published Wed, Dec 9 2015 5:31 PM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM
Advertisement
Advertisement